ఆరోగ్య మంత్రి దామోదర్ రాజ నరసింహ మరియు సీనియర్ ఆరోగ్య అధికారులతో జరిగిన చర్చలు విజయవంతం కావడంతో, తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (TANHA) శుక్రవారం రాత్రి నిరసనలను విరమించుకుని, వెంటనే ఆరోగ్యశ్రీ ఆరోగ్య సేవలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది.
ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ CEO పి. ఉదయ్ కుమార్ సహా సీనియర్ ఆరోగ్య అధికారుల సమక్షంలో ఆరోగ్య మంత్రి శుక్రవారం రాత్రి TANHA సభ్యులతో చర్చలు జరిపారు.
“ఆర్థిక మరియు ఆర్థికేతర అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఆరోగ్య మంత్రి మాకు వ్యక్తిగతంగా హామీ ఇచ్చారు. వెంటనే దానికి సంబంధించిన ఉత్తర్వలు కూడా జారీ చేశారు. ప్రభుత్వం తో మా చర్చలు సఫలం కావడం తో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మా అన్ని ఆరోగ్యశ్రీ సేవలను తిరిగి ప్రారంభిస్తున్నాము” అని TANHA సభ్యులు శుక్రవారం రాత్రి తెలిపారు. నిరసనల సమయంలో రోగులకు కలిగిన అసౌకర్యానికి తీవ్రంగా క్షమాపణలు కోరుతున్నాము అని TANHA సభ్యులు తెలిపారు.