మండల విద్యాధికారి బివి.రామాచారి
కూసుమంచి మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో ప్రతి సోమవారం, బుధవారం నిర్వహిస్తున్న ఫిజియోథెరపీ క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాధికారి బివి.రామాచారి అన్నారు. స్థానిక భవిత కేంద్రంలో నిర్వహించబడుతున్న ఫిజియోథెరపీ క్యాంప్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా బివి.రామాచారి మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఏర్పాటు చేయబడినదే భవిత కేంద్రం అని తెలిపారు. ఈ కేంద్రంలో సాధారణ విద్యార్థులతో సమానంగా విద్యను అందించడంతో పాటు, వారి మానసిక, శారీరక ఎదుగుదలకు సహాయం చేస్తారని చెప్పారు.విద్యార్థులకు విద్యతో పాటు వసతులు, అవసరమైన స్టడీ మెటీరియల్స్, ఫిజియోథెరపీ వంటి సదుపాయాలను కల్పిస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐఇఆర్పి కళ్యాణి, ఫిజియోథెరపిస్ట్ గోపి నాగలక్ష్మి, సిఆర్పి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.