Friday, October 3, 2025
ePaper
Homeతెలంగాణనిబంధనల ధిక్కరణ విత్తన కంపెనీల పై చర్యలు చేపట్టండి..

నిబంధనల ధిక్కరణ విత్తన కంపెనీల పై చర్యలు చేపట్టండి..

రైతు రాష్ట్ర నాయకులు”జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి వేముల

చట్ట ప్రకారం కాకుండా ప్రభుత్వ నిబంధనలు ధిక్కరిస్తూ రైతులతో సాగు చేపిస్తున్న విత్తన కంపెనీల పై సంబంధిత ఆర్గనైజర్ ల పై కఠిన చర్యలు చేపట్టి క్రిమినల్ కేసులు నమోదు చేయాల‌ని రైతు రాష్ట్ర నాయకులు మరియు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ పరాజితులు జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి వేముల కోరారు. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని వ్యవసాయ శాఖ ఉన్నత అధికారి కార్యాలయంలో డి.ఏ.ఓ వి.బాస్కర్ కి పిర్యాదు పత్రం అందించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. నిబంధానావలికి విరుద్దంగా ఎటువంటి అగ్రిమెంట్ చేసుకోకుండా మాయమాటలు చేప్పి రైతులతో విత్తన కంపెనీల ఆర్గనైజర్ లు సాగు చేపిస్తు రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలు అనుసరించని కంపెనీల పై చర్యలు చేపట్టి క్రిమినల్ కేసులు నమోదు చేసి కట్టడి చేయాల్సిన అవసరం ఉంద‌ని సూచించారు. వ్యవసాయ శాఖ వెంటనే సంబందిత చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, లేనిప‌క్షంలో విత్తనోత్పత్తి సాగు చేపడుతున్నవారు కాకుండా, వ్యవసాయ రంగం పూడ్చలేని నష్టాలకు గురి అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు నాయకులు మల్లాపూర్ మండల ఉత్తమ యువ రైతు కంది వినోద్ రెడ్డి, మల్లన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News