Wednesday, February 11, 2026
Homeస్పోర్ట్స్T20 League | వెంకటస్వామి లీగ్‌ను వెంటనే ఆపండి

T20 League | వెంకటస్వామి లీగ్‌ను వెంటనే ఆపండి

బీసీసీఐకి టీసీఏ మరోసారి విజ్ఞప్తి

ప్రభుత్వ, బీసీసీఐ (BCCI) నిబంధనలకు, ఆదేశాలకు విరుద్ధంగా, న్యాయపరమైన ప్రక్రియలను ఉల్లంఘిస్తూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (Hyderabad Cricket Association) నిర్వహించ తలపెట్టిన ‘జి.వెంకటస్వామి మెమోరియల్ అంతర్‌ జిల్లాల’(G.Venkata Swamy Memorial Inter-District) టీ20 లీగ్‌ను వెంటనే ఆపాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గురవారెడ్డి కోరారు. ఈ మేరకు బీసీసీఐకి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లోని జస్టిస్ నవీన్ రావు (రిటైర్డ్) ఆధ్వర్యంలోని ఏకసభ్య కమిటీకి, బీసీసీఐ అంబుడ్స్‌మన్ (Ombudsman) జస్టిస్ అరుణ్ మిశ్రాకి లేఖ రాశారు. ఇదే అంశాన్ని గతంలో కూడా మీ దృష్టికి తీసుకొచ్చినా ఎలాంటి స్పందనా లేకపోవటం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇదే టోర్నమెంట్‌ను బీసీసీఐ 2018లో తిరస్కరించిన విషయాన్ని గుర్తుచేశారు. టీసీఏ, హెచ్‌సీఏ మధ్య పెండింగ్‌లో ఉన్న ఇష్యూలను కూడా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News