- రాజాపూర్ మండలం తిరుమలపూర్లో అక్రమ వెంచర్
- గ్రామ పంచాయతీ, డిటిసిపి అనుమతులు లేవు..
- పోలీస్ యూనిఫామ్ వేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ.. అడ్డగోలు మోసాలకు పాల్పడుతున్న చండ్ర చంద్రశేఖర్
- ఎర్లీబర్డ్ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతూ దోపిడీ..
- రెరా చట్టానికి తూట్లు పొడుస్తున్న దుర్మాగం..
- స్వర్గసీమ యాజమాన్యం అక్రమాలకు అండగా అధికారులు..!
ఈయన చెప్పే మాటలు వింటే ఎవరైనా నమ్మాల్సిందే.. ఈయన వేసే వేషాలు చూస్తే అతని మాయలో పడిపోవాల్సిందే.. ఒక్కటి కాదు రక రకాల వేషాలు వేస్తాడు.. ఒకసారి పోలీస్, మరోసారి సెక్యూరిటీ గార్డ్, ఇంకొక సారి పౌరాణిక పాత్ర, మరోసారి ఉన్నతాధికారిగా.. ఇలా కనిపిస్తూ.. సోషల్ మీడియాలో ప్రకటనలు గుప్పిస్తాడు..జనాలను ఆకర్షిస్తూ తన మోసాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు.. అనుమతులు లేని వెంచర్లు వేస్తూ అమాయకులను కొల్లగొడుతూ కోట్లలో సంపాదిస్తున్నాడు. ఈయనే స్వర్గసీమ రియల్ ఎస్టేట్ కంపెనీ యజమాని చండ్ర చంద్రశేఖర్.. పేరుకే స్వర్గసీమ.. ఈయన వలలో పడ్డామా నరకమే గతి అవుతుంది..
మహబూబ్నగర్ జిల్లా, రాజాపూర్ మండలం, తిరుమలాపూర్ గ్రామంలో ‘స్వర్గసీమ అమేయ’ పేరుతో భారీ మోసాలకు తెరలేపాడు చండ్ర చంద్రశేఖర్.. ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లో ఎర్లీబర్డ్ స్కీం పేరుతో ఆఫర్లను బూచిగా చూపుతూ, ప్రీ లాంచ్ పేరుతో అమాయక కస్టమర్లను మోసం చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

స్వర్గసీమ శాండిల్ పేరుతో ఉన్న ఈ వెంచర్ లో 75 ఎకరాల భూమిలో.. గుంటల్లో అమ్మి సొమ్ము చేసుకున్నారు.. ఫాం ల్యాండ్ పేరుతో గ్రేటెడ్ కమ్యూనిటీ అన్నట్లు కలరింగ్ ఇస్తూ.. ప్రహరీ గోడను నిర్మించాడు.. పంచాయతీ రాజ్ చట్టం 2018 నిబంధనలు తుంగలో తొక్కి అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డాడు చండ్ర చంద్ర శేఖర్.. షాద్ నగర్ లో ప్లాట్లు అని చెపుతూ కష్టమర్లను మోసం చేస్తూ.. మహబూబ్ నగర్ లో ప్లాట్లు అమ్ముతున్నాడు..
కొందుర్గ్ గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వర్గసీమ వెంచర్ వారికి అమ్ముడుపోయి ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.. ఎలాంటి నిర్మాణ అనుమతులు లేకుండా అడ్డగోలుగా నిర్మాణాలు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నాడనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి.. వివిధ వేషధారణలతో కలరింగ్ ఇస్తూ.. ఫామ్ ల్యాండ్ పేరుతో అక్రమాలకు పాల్పడుతూన్నాడనే బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

గేటెడ్ కమ్యూనిటీ అంటూ ప్రహారీ నిర్మాణం :
ఫామ్ ల్యాండ్లకు నిబంధనల ప్రకారం ఫెన్సింగ్ మాత్రమే ఉండాలి.. కానీ అందుకు భిన్నంగా ఏకంగా గేటెడ్ కమ్యూనిటీని తలదన్నే విధంగా చుట్టూ భారీ ప్రహారీ నిర్మాణం చేపట్టినట్లు ఆరోపణలు బలంగా ఉన్నాయి.. ఏదైనా లే అవుట్ అనుమతి పొందాలంటే పంచాయతీ రాజ్ వెబ్ సైట్ లో సంబంధిత పత్రాలను సమర్పించి అనుమతులు తీసుకోవాలి.. 2023లో అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న ఇతగాడికి అనుమతి ఇవ్వలేదని, ఆన్ లైన్ లో మాత్రమే అందుకు ఆధారంగా చూడవచ్చు.. ఇంత బహిరంగంగా అక్రమ వెంచర్ చేసి మోసాలు చేస్తున్నా అధికారులు చర్యలు చేపట్టకుండా ఉండటంతో ఈయన అవినీతికి పాల్పడ్డారు అనటానికి బలం చేకూరుతుంది..

సర్వే నెంబర్ 78 లోని చెరువు ఏమైంది..?
తిరుమలాపూర్ గ్రామంలోని ఉన్న సోని చెరువు సర్వే నెంబర్ 78లో ఉంది.. అయితే చెరువు విస్తీర్ణం ఎంతనేది తేల్చకుండానే, నీటిపారుదల శాఖ అధికారులు బఫర్ జోన్ నిర్ణయించి ఎన్ఎసీలు జారీ చేశారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.. ఇక సర్వే నెంబర్ 78/1 లో 17 ఎకరాల 7 గుంటలు పట్టాభూమిగా రెవెన్యూ రికార్డులు సృష్టించారన్న ఆరోపణలు బాహాటంగానే వినిపిస్తున్నాయి..

చెప్పేది షాద్నగర్…
అమ్మేది మహబూబ్నగర్ లో :
ప్రకటనల్లో మాత్రం “షాద్నగర్ సమీపంలో” అంటూ విస్తృతంగా చేస్తున్నాడు.. వాస్తవానికి ప్రచారం ఈ వెంచరు షాద్నగరికైనా, బాలానగరైకైనా సంబంధం లేదని స్థానికులు చెబుతున్నారు.. రాజాపూర్ మండలంలోని మారుమూల తాండాలో ఎకరం సుమారు రూ.30–40 లక్షలకు రైతుల నుంచి కొనుగోలు చేసి, స్వల్ప అభివృద్ధి పేరుతో ఎకరాన్ని కోట్లు పలికేలా విక్రయిస్తున్నారని ఈ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు.
అక్రమ బ్లాస్టింగ్ పై అధికారులు మౌనం ! :
వెంచర్ పరిసరాల్లో అక్రమ బ్లాస్టింగ్లు, కొండల తవ్వకాలు జరుగుతున్నా మైనింగ్ అధికారులు సైతం మౌనం పాటిస్తున్నారననే విమర్శలు వినిపిస్తున్నాయి.. రియల్టర్లతో అధికారులు లోపాయికారి చేసుకొని చండ్ర చంద్ర శేఖర్ చేసే అక్రమాలకు వత్తాసు పలుకుతున్నట్లు అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టి.. స్వర్గసీమ, అమోయ వెంచర్ యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని పలువురు సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.. చండ్ర చంద్ర శేఖర్ చేస్తున్న అక్రమాలకు సంబంధించి అమాయక ప్రజలను నిండా ముంచుతున్న మోసాలకు సంబంధించి, మరో కథనం ద్వారా ఆధారాలతో సహా వెలుగులోకి తేనుంది.
