- నేటి యువతకు స్ఫూర్తి స్వామి వివేకానంద.
- బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్.
జాతీయ బీసీ యువజన సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ స్వామి వివేకానంద 163 వ జయంతి సందర్భంగా జ్యోతి నగర్ లోని ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారత ప్రభుత్వం 1984 సంవత్సరంలో స్వామి వివేకానంద జయంతిని జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం గా ప్రకటించింది అన్నారు. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నేతృత్వంలో అధికారికంగా మొదటి వేడుక 1985 జనవరి 12న న్యూఢిల్లీలో ఘనంగా నిర్వహించారనీ అన్నారు. నాటి నుంచి నేటి వరకు దేశవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక రాష్ట్రంలో జనవరి 12 నుండి 16 వరకు జాతీయ యువజన ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయం.
భారతదేశ ప్రగతి యువ వికాసంతోనే సాధ్యమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువజన శాఖ సేవ శిక్షణ కార్యక్రమాలు విస్తరించాలని, ప్రతి ఒక్క మండల కేంద్రంలో యువ వికాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. నేటి యువత స్వామి వివేకానంద ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు కొనసాగాలని కోరారు. ఈ దేశాభివృద్ధి యువకుల చేతుల్లోనే ఉందని అన్ని రకాలుగా అవకాశాలను అందిపుచ్చుకొని మంచి మార్గంలో నడవాలని ఈ సందర్భంగా కోరారు.ఈ కార్యక్రమంలో బిసి యువజన సంఘం జిల్లా కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాస్ బీసీ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

