మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా నాగారం మునిసిపాలిటీ పరిధిలోని రాంపల్లి చౌరస్తా వద్ద ఏర్పాటుచేసిన సురేష్ డెంటల్ క్లినిక్(Suresh Dental Clinic)ను ఉప్పల్ ఎమ్మెల్యే (Uppal Mla) బండారి లక్ష్మారెడ్డి (Bandari Laxma Reddy) గురువారం ప్రారంభించారు. ప్రజలకు ఆధునిక సదుపాయాలతో నాణ్యమైన దంత చికిత్స అందించాలనే లక్ష్యంతో ఈ క్లినిక్‌ను ఏర్పాటు చేసినట్లు డాక్టర్ సురేష్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో నాగారం (Nagaram) మాజీ మునిసిపల్ కమిషనర్ (Municipal Commissioner) కౌకుట్ల చంద్ర రెడ్డి, బిఆర్ఎస్ (Brs) నాయకులు నేమురి మహేష్ గౌడ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాలనీవాసులు, డా. ధీవత్ సురేష్ (బీడిఎస్), డి. చందర్ (అసిస్టెంట్ ఇంజనీర్, టీఎస్‌ఆర్‌టీసీ), డా. జే. ప్రతాప్ కుమార్ (పిహెచ్.డి), వి. హరిలోల్ (ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్), తారాచంద్ (సెక్షన్ ఇంజనీర్), డా. వాణి, డి. చుక్కబాయి (ఏఎస్‌ఐ), జె. రాములు, డి. సంతోష్, డి. బాబు నాయక్, డి. హనుమాన్ తదితరులు పాల్గొన్నారు.
