Monday, October 27, 2025
ePaper
Homeతెలంగాణఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు స్టే

ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు స్టే

  • గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకం
  • తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక ఉండాలన్న సుప్రీంకోర్టు

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటాలో వీరిద్దరినీ ఎమ్మెల్సీలుగా నియమించగా, ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ కుమార్, సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం, స్టే విధించింది. తాజా తీర్పులో, గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవరించిన ధర్మాసనం, కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ప్రమాణ స్వీకారం జరగకూడదని స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నియామకాలు నిలిపివేయాలని పేర్కొంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News