క్రికెట్ దేవుడి(God Of Cricket)గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే మాస్టర్ బ్లాస్టర్ (Master Blaster) సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) కన్నా కింగ్ కోహ్లీ (King Kohli) మిన్న అనే అర్థం వచ్చేలా సీనియర్ మోస్ట్ బ్యాటర్, టీమిండియా (Team India) మాజీ సభ్యుడు సునిల్ గవాస్కర్ వ్యాఖ్యానించారు. సచిన్ రికార్డులనే బ్రేక్ చేశాడంటే అతనేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అని పేర్కొన్నారు.
ప్రపంచంలోని ప్రతిఒక్కరూ.. చివరికి ఆస్ట్రేలియా క్రికెటర్లు సైతం కోహ్లీని మెచ్చుకోవటం మామూలు విషయం కాదని అన్నారు. నిన్న రాంచీలో దక్షిణాఫ్రికాతో మన దేశం ఆడిన వన్డేలో విరాట్ కోహ్లీ 52వ సెంచరీ (52nd Century) చేయటమే దీనికి నేపథ్యం. ఇప్పటివరకు ఒక ఫార్మాట్‌లో (టెస్టుల్లో) 51 సెంచరీలే అత్యధికం. సచిన్ సాధించిన ఆ రికార్డును కోహ్లీ తాజాగా వన్డేల్లో అధిగమించాడు.
