Wednesday, September 10, 2025
ePaper
spot_img
Homeబిజినెస్విజయవంతంగా ముగిసిన మంగళ్ ఎలక్ట్రికల్ యాంకర్ బుక్

విజయవంతంగా ముగిసిన మంగళ్ ఎలక్ట్రికల్ యాంకర్ బుక్

ట్రాన్స్‌ఫార్మర్ కంపోనెంట్స్ ప్రాసెసింగ్, ట్రాన్స్‌ఫార్మర్ తయారీ మరియు సమగ్ర ఈపీసీ సేవలలో వేగంగా ఎదుగుతున్న మంగళ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఎంఈఎల్) తన రూ.120 కోట్ల యాంకర్ బుక్ విజయవంతంగా ముగిసినట్లు ప్రకటించింది. ఈ యాంకర్ బుక్‌పై పెట్టుబడిదారుల నుండి అంచనాలను మించి, 2.5 రెట్లకు పైగా బిడ్లు వచ్చాయి.

ఈ యాంకర్ పోర్షన్‌లో అబక్కస్ ఏఐఎఫ్, సుందరం ఏఐఎఫ్, మిరాస్ ఇన్వెస్ట్‌మెంట్స్, ఎల్ఎంఆర్ పార్ట్‌నర్స్, ఫినావెన్యూ గ్రోత్ ఫండ్ వంటి దేశీయ, విదేశీ ప్రముఖ సంస్థాగత ఇన్వెస్టర్లు పాల్గొనడం గమనార్హం. ఇక, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ ఈ ఇష్యూ‌కు “సబ్ స్క్రైబ్” రేటింగ్ ఇస్తూ, సంస్థ యొక్క శక్తివంతమైన బ్యాక్‌వర్డ్-ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్, విస్తృత కస్టమర్ బేస్, నిరంతర వృద్ధి రికార్డ్ దృష్ట్యా ఈ ఐపిఓలో పెట్టుబడి పెట్టాలని సిఫార్సు చేసింది. అదే సమయంలో ఆనంద్ రాఠి సంస్థ “సబ్ స్క్రైబ్ – లాంగ్ టర్మ్” రేటింగ్ ఇచ్చి, ఎఫ్‌వై 25 ఆధారంగా కంపెనీ పి/ఈ 32.8ఎక్స్ వద్ద విలువైనదని, దీర్ఘకాలిక పెట్టుబడికి అనుకూలమని పేర్కొంది.

మంగళ్ ఎలక్ట్రికల్ ఐపీఓ పరిమాణం ₹400 కోట్లు కాగా, మొత్తం ఇష్యూ ఫ్రెష్ ఇష్యూ రూపంలోనే అందుబాటులోకి వస్తుంది. షేర్ ధర బాండ్‌ను ₹533 – ₹561 మధ్యగా నిర్ణయించారు. ఈ ఐపీఓ ఆగస్టు 20 నుండి 22, 2025 వరకు పెట్టుబడిదారులకు అందుబాటులో ఉంటుంది. సిస్టమాటిక్స్ కార్పొరేట్ సర్వీసెస్ లిమిటెడ్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా, బిగ్‌షేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నాయి.

1989లో స్థాపించబడిన ఎంఈఎల్, జైపూర్‌లో ఐదు బ్యాక్‌వర్డ్-ఇంటిగ్రేటెడ్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లను విజయవంతంగా నడుపుతోంది. సంస్థకు పిజిసిఐఎల్, ఎన్టీపీసీ వంటి ప్రభుత్వ రంగ మహారథుల నుండి అప్రూవల్స్ లభించాయి. అంతేకాకుండా, ఎంఈఎల్ ఉత్పత్తులు భారత్‌తో పాటు నెదర్లాండ్స్, యుఏఈ, ఒమాన్, యుఎస్ఏ, ఇటలీ, నేపాల్ వంటి దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Latest News