Tuesday, February 10, 2026
Homeమహబూబ్‌నగర్‌అంబేద్కర్ స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నతమైన స్థాయికి చేరాలి.

అంబేద్కర్ స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నతమైన స్థాయికి చేరాలి.

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు గంధం నాగరాజు..

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంధం నాగరాజు విద్యార్థులకు సూచించారు. గురువారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం 76వ దినోత్సవాన్ని పురస్కరించుకొని వనపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలుర) లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంధం నాగరాజు చదువుపై చక్కని పాటను ఆలపించి విద్యార్థులకు చక్కటి సందేశాన్ని అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.

ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం అని, పౌరులు విధులు, హక్కులు, బాధ్యతలు తెలుసుకొని రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి పౌరుడు పాటుపడాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మెడికల్ ఎంప్లాయ్ బండారు శ్రీనివాసులు పాఠశాలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని బహుకరించారు. వ్యాసరచన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయు లు జ్ఞాపికలు అందజేశారు. పాట ఆలపించిన గంధం నాగరాజును, అంబేద్కర్ చిత్రపటాన్ని బహుకరించిన బండారు శ్రీనివాసులు ను పాఠశాల ప్రధానోపాధ్యాయు లు విద్యార్థుల తో కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News