Wednesday, February 11, 2026
Homeహైదరాబాద్‌Child Marriages | బాల్యవివాహాలు చేస్తే కఠిన చర్యలు

Child Marriages | బాల్యవివాహాలు చేస్తే కఠిన చర్యలు

సైబరాబాద్ డీసీపీ సూర్జన హెచ్చరిక

హైదరాబాద్‌: ఈ రోజుల్లో పురుషులతో సమానంగా ఆడవాళ్లు అన్ని రంగాల్లో రాణిస్తున్నా ఎన్నో ఏళ్ల నుంచి మన దేశంలో బాల్య వివాహ వ్యవస్థ కొనసాగుతుండటం ఆందోళనకరమని సైబరాబాద్‌ కమిషనరేట్‌ (Cyberabad Commissionerate) ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ సేఫ్టీ వింగ్‌ డీసీపీ కె.సూర్జన అన్నారు. శనివారం యాంటీ హ్యుమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌ (Anti-Human Trafficking Unit) ఆధ్వరంలో పలు ప్రాంతాల్లో బాల్య వివాహాలు, మహిళల అక్రమ రవాణా, సోషల్‌ మిడియా(Social Media), సైబర్‌క్రైం(Cyber Crime), భిక్షాటన (Begging) తదితర అంశాలపై స్కూల్‌ విద్యార్థులకు, స్థానికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల ఏటా వందల సంఖ్యలో బాలికలు మరణిస్తున్నారు. బాల్య వివాహాల వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలతో బాలికలు ప్రాణాలు కోల్పోతున్నారని పలు స్వచ్చంధ సంస్థలు (Ngo) పేర్కొంటున్నాయి.

- Advertisement -

చిన్న వయసులోనే వివాహ కావడం వల్ల ఎదురయ్యే గర్భాశయ సమస్యలు మాతాశిశు మరణాలు ప్రపంచ వ్యాప్తంగా పేరుగుతున్న విషయం నివేదికల ద్వారా తెలుస్తుంది. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న బాలిక 21 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న బాలుడి పెళ్లిళ్లను బాల్య వివాహ నిషేధ చట్టం 2006 నిషేదిస్తుందని తెలిపారు. సైబరాబాద్‌ యాంటీ హ్యుమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌ వారం రోజుల నుంచి వివిధ ఏరియాల్లో రాత్రి సమయంలో దాడులు నిర్వహించి 9 మంది ట్రాన్స్‌జెండర్ల(Transgender)ను అదుపులోకి తీసుకుంది. ముగ్గురు బాధితులను రక్షించి, రెండు పీటా కేసులు (Peta Cases) నమోదు చేసింది. వీటితోపాటు షీ టీం (She Team) 142 డెకాయ్‌ ఆపరేషన్లు నిర్వహించి 76 మందిని అదుపులోకి తీసుకుంది. 51 మందిపై చిన్న పాటి కేసులు నమోదు చేశారు. మిగిలినవారికి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించారు. 17 మంది మహిళా బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ తాగాదాలు ఉన్న 29 జంటలను తిరిగి కలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News