Friday, April 17, 2026
Homeహైదరాబాద్‌Phones Recovery | ఫోన్లు పోతే వెంటనే ఫిర్యాదు చేయండి

Phones Recovery | ఫోన్లు పోతే వెంటనే ఫిర్యాదు చేయండి

సెల్‌ఫోన్‌ల రికవరీలపై పోలీసుల నజర్‌

నార్త్‌ జోన్‌ డీసీపీ రష్మీ పెరుమళ్ వెల్లడి

- Advertisement -

హైదరాబాద్‌: చోరీలకు గురైన సెల్‌ఫోన్‌ల రికవరీల(Cell Phones Recovery)పై హైదరాబాద్‌ పోలీసులు (Hyderabad Police) ప్రత్యేక దృష్టి (Special Focus) సారించారు. రికవరీ చేసిన 111 ఫోన్లను పోగొట్టుకున్నవారికి అందజేశారు. దీంతో.. బాధితులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. నార్త్‌ జోన్‌ పరిధిలోని వివిధ స్టేషన్లలో నమోదైన ఫిర్యాదుల ఆదారంగా ఫోన్లు స్వాధీనం చేసుకొని బాధితులకు అందజేస్తామని డీసీపీ రష్మీ పెరుమళ్‌ అన్నారు. శనివారం బాధితులకు సెల్‌ఫోన్లను అందించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్ల జాడ కనిపెట్టేందుకు అమల్లోకి తెచ్చిన సీఈఐఆర్‌ (CEIR-సెంట్రల్‌ ఎక్విప్మెంట్‌ ఇడెంటిటీ రిజిస్టార్‌) పోర్టల్‌ (Portal) విధానం సత్పలితాలిస్తోంది.

ఈ పోర్టల్‌ విధానంతో చోరీకి గురైన పోన్లను రికవరీ చేస్తున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదులు అందిన వేంటనే సీఈఐఆర్‌ విధానంతో బ్లాక్‌ (Block) చేస్తున్నామని, నగర పౌరులెవరైనా సరే తమ మొబైల్‌ ఫోన్లు పోగొట్టుకున్నట్లయితే వెంటనే దగ్గరలోని మీ సేవా (MeeSeva) లేదా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి సీఈఐఆర్‌ విధానంలో ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. సెల్‌ఫోన్ల రికవరీలో ప్రత్యేక చోరవ చూపించిన సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News