Tuesday, February 10, 2026
HomeతెలంగాణSTF | ఉపముఖ్యమంత్రి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు

STF | ఉపముఖ్యమంత్రి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు

  • ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన STF రాష్ట్ర శాఖ, ప్రభుత్వ విద్యాభివృద్ధి కార్యక్రమాలకు అభినందన

ప్రజా భవన్‌లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ని School Teachers Federation (STF) రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ సైదులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు. పోచయ్య మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ప్రజా ప్రభుత్వం విద్యారంగ బలోపేతం కోసం చేపడుతున్న పలు కీలక కార్యక్రమాలకు STF రాష్ట్ర శాఖ అభినందనలు తెలిపింది. ముఖ్యంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు, విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా స్కావెంజర్ల నియామకం, విద్యార్థుల మెస్ చార్జీల పెంపు, ఉపకార వేతనాలను సకాలంలో చెల్లించడం వంటి నిర్ణయాలు ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాయని STF నాయకత్వం అభిప్రాయపడింది.

- Advertisement -

అలాగే గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.317లోని లోపాలను సరిదిద్దుతూ జీవో నం.190ను జారీ చేసినందుకు ఉప ముఖ్యమంత్రి కి STF ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. పెండింగ్‌లో ఉన్న 317 ఉపాధ్యాయుల డిప్యుటేషన్ ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా కోరగా, ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో STF రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ సైదులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు. పోచయ్య, STF నాయకులు నాగేశ్వరరావు, రత్నమాల, మహేందర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News