నిమ్స్‌లో స్టెమ్ సెల్ ల్యాబ్(Stem Cell Lab)ను ఆరోగ్య శాఖ మంత్రి(Health Minister) దామోదర రాజనరసింహ(Damodar Rajanarasimha) సోమవారం ప్రారంభించారు. అందరికీ అధునాతన ఆరోగ్య సంరక్షణ అందించేందుకు అమెరికాకు చెందిన(US-based) తులసి థెరప్యూటిక్స్(Tulasi Therapeutics) సహకారంతో ఈ ల్యాబ్‌ను ఏర్పాటుచేశారు. ఈ ప్రయోగశాలలో నిమ్స్ వైద్యులు, తులసి థెరప్యూటిక్స్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా అధునాతన స్టెమ్ సెల్ పరిశోధనపై దృష్టి సారిస్తారు. తద్వారా.. భవిష్యత్తులో క్యాన్సర్, రక్త రుగ్మతలు, తలసేమియాకు తక్కువ ఖర్చుతో చికిత్సకు మార్గం సుగమం చేస్తారు.
- Advertisement -
