నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్థానిక రవి నగర్లో గల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో నిన్న అర్ధరాత్రి చోరీ జరిగిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా వైర్లను ధ్వంసం చేసి మరి ఆలయంలో రెండున్నర కిలోల గల వెండి అభరణాలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. రోజు రోజుకు ఆలయాల్లో పెరిగిపోతున్న దొంగతనాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలను తీసుకోలన్నారు.

- Advertisement -
