Thursday, March 12, 2026
Homeఆరోగ్యంSprouted Garlic | మొలకెత్తిన వెల్లుల్లి ఎంతో శ్రేష్టం..

Sprouted Garlic | మొలకెత్తిన వెల్లుల్లి ఎంతో శ్రేష్టం..

  • యాంటీ ఆక్షిడెంట్స్ అధికం..
  • వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తాయి..

సాధారణ వెల్లుల్లితో పోలిస్తే.. మొలకెత్తిన వెల్లుల్లిలో యాంటి ఆక్సిడెంట్‌ స్థాయులు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీరాడికల్స్‌తో పోరాడి, కణాల నాశనాన్ని అరికడుతాయి. వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తాయి. వెల్లుల్లి మొలకెత్తినప్పుడు అందులోని ఎంజైమ్‌ల చర్య పెరుగుతుంది. ఇది రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా నిరోధిస్తుంది.

తద్వారా గుండెపోటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఇక ఇందులోని సల్ఫర్‌ సమ్మేళనాలు.. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. జలుబు, దగ్గు వంటి సీజనల్‌ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. మొలకెత్తిన వెల్లుల్లిలో క్యాన్సర్‌ కణాలతో పోరాడే గుణాలు గరిష్ఠ స్థాయిలో ఉంటాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. అధిక రక్తపోటు బాధితులకూ ఇవి ఎంతో మేలు చేస్తాయి. బీపీని తగ్గించడంలో సహజ ఔషధంలా పనిచేస్తాయి.

- Advertisement -

రక్త ప్రసరణను మెరుగుపరిచి, రక్తపోటును అదుపులో ఉంచుతాయి. అందుకే మొలకెత్తిన వెల్లుల్లిని పారేయకుండా ఆహారంలో భాగం చేసుకోవడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. అయితే, వెల్లుల్లి తాజాగా ఉండి మొలకలు వస్తేనే ఆరోగ్యానికి మంచిది. ఒకవేళ రెబ్బలు మెత్తబడి, బూజు పట్టినట్టుగా నల్లటి మచ్చలు ఏర్పడితే.. వాటిని ఉపయోగించక పోవడమే బెటర్‌!

- Advertisement -
RELATED ARTICLES

Latest News