- ఏజెన్సీలో 1/70 చట్టం మరియు పిసా చట్టం అమలులో ఉన్నది
- చట్టాలకు వ్యతిరేకంగా మట్టిని అక్రమంగా తరలిస్తున్న వారిపై తక్షణమే కేసు నమోదు చేయాలి
- ఐటిడిఏ పిఓ ఏటూరునాగారం తక్షణమే స్పందించాలి.
- లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తేజావత్ వాసు నాయక్
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం పరిధిలోని ఏజెన్సీ గ్రామమైన ముత్యాలమ్మ తండా శివారు కు సంబంధించిన భూములపై కన్నువేసిన మట్టి మాఫియా తక్షణమే నిలిపివేయాలి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల భూములలో గిరిజనేతరులు ఎ టువంటి తవ్వకాలు చేసిన అక్రమ నిర్మాణాలు చేసిన ఆ ప్రాంతంలోని గ్రామ ప్రజల తీర్మానం మేరకు మాత్రమే జరగాలి కానీ అక్కడ చట్టాలను తుంగలో తొక్కి ఏదేచ్ఛగా మట్టిని పట్టణాలకు తరలిస్తున్నారు ఏజెన్సీ ప్రాంతంలో ఏజెన్సీ చట్టాలు నిబంధనలు ఎన్ని ఉన్నా అధికార అహంకారంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అమాయక గిరిజనులను భయభ్రాంతులకు గురిచేస్తూ అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు.
తక్షణమే ఆపాలని ఈ అక్రమ దందాపై జిల్లా కలెక్టర్ గారు స్వయంగా సందర్శించి తక్షణమే ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి మట్టి మాఫియాను వెంటనే నిలిపివేయాలని వాసు నాయక్ డిమాండ్ చేశారు . ఈ ప్రాంతంలోని ఎమ్మార్వో ఆర్డీవో ల అండదండలతో సహకరంతో ఏజెన్సీ ప్రాంతం నుండి అక్రమంగా మట్టి పట్టణాలకు తరలిస్తున్నది అందుకుని మట్టి తరలించకుండా ఆపవలసిన బాధ్యత జిల్లా కలెక్టర్ ఆర్ డి ఓ పై ఉన్నది తక్షణమే మట్టి మాఫియాను అరికట్టకపోతే లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో భారీ ఎత్తున రాస్తారోకో ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు వందలాదిమంది గిరిజనులతో చేపడతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో జాటోత్ బండారం నాయక్, జాటోథ్ బాలాజీ నాయక్, శ్రీనివాస్ నాయక్, నునావత్ పవన్ నాయక్, లాకావత్ బాబ్జి నాయక్ పాల్గొన్నారు.
