- ఉమ్మడి జిల్లాలో ఐదు చైన్ స్నాచింగ్ కేసు నమోదు.
- అత్యంత ఆప్రమతతో కేసులను చేదించి ముఠాను అరెస్టు చేసిన పోలీసులు..
- డి.ఎస్.పి వెంకటేశ్వరరావు..
ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్ ముఠా పథకం ప్రకారం దొంగతనాలకు పాల్పడుతున్నారని డి.ఎస్.పి వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం రూరల్ పోలీస్ స్టేషన్ లో చైన్ స్నాచింగ్ ముఠాను, వారికి సంబంధించిన వివరాలను విలేకరుల సమావేశంలో డి.ఎస్.పి వెల్లడించారు. వనపర్తి జిల్లా అమరచింత మండలం నాగల్ కడుమూరు గ్రామానికి చెందిన కుర్వ రాములు, గట్టు వెంకటేష్, డ్యామ్ వెంకటేష్, బండమీది రాజేష్ లు ముఠాగా ఏర్పడి ఈనెల 12 న వనపర్తి పట్టణంలో తిరుగుతూ.. లక్ష్మీనరసింహ కాలనీలో ఒంటరిగా నడుచుకుంటూ వస్తున్న మహిళ మెడలో ఉన్న చైన్ ను కుర్వ రాములు, బండి మీది రాజేష్ బైక్ పై వచ్చి దొంగిలించి పారిపోయారు. బాధితురాలు రూరల్ పోలీస్ స్టేషన్లో అదేరోజు కంప్లైంట్ ఇవ్వడంతో ఎస్సై జలంధర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇదేవిధంగా గతంలో కూడా ఉమ్మడి జిల్లాలో నాలుగు కేసులు నమోదై ఉన్నాయని డి.ఎస్.పి తెలిపారు. మంగళవారం నాగవరం వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా నేరస్తులు ఇద్దరు బైక్ పై వచ్చారని.. ఆపడానికి ప్రయత్నిస్తే పారిపోయే ప్రయత్నం చేశారనీ.. అనుమానంతో వారిని పట్టుకొని విచారిస్తే మిగతా ఇద్దరి పేర్లు తెలిపారని చెప్పారు. పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తానమని తెలిపారు. నిందితుల నుండి దాదాపు 40 లక్షల విలువగల 10.4 గ్రాముల బంగారం, 2 పల్సర్ బైకులు, 2 కార్లు,1 ఆటో స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానంతో చాక్య చక్యంగా 5 చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన వనపర్తి సీఐ కృష్ణయ్య, ఎస్సై జలంధర్ రెడ్డి, ఎస్సై వేణుగోపాల్, సిబ్బంది రఫిక్, ఆంజనేయులు, నవీన్, రామ్ గోపాల్ వర్మ, ప్రవీణ్ లను జిల్లా ఎస్పీ అభినందించి వారికి రివార్డు అందజేశారు.

