- గ్రామాలను అభివృద్ధి చేశాం బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి.
- మాజీమంత్రి నిరంజన్ రెడ్డి…
గత పది ఏళ్ల పాలనలో గ్రామాలను అభివృద్ధి చేశామని, భవిష్యత్తులో గ్రామాల అభివృద్ధి కొరకై బిఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం గ్రామపంచాయతీ రెండవ విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా సవాయిగూడెం, పెద్దగూడెం తాండ, పెద్దగూడెం, కడుకుంట్ల గ్రామాలలో పర్యటించి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. రెండేళ్లుగా గ్రామలలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని.. నాయకుల పెత్తనం కోసం గ్రామంలో కలహాలు సృష్టించి పబ్బం గడుపుతూ కాలం వెల్లదీస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

గ్రామలాల్లో నియంత పాలనకు చమర గీతం పాడి, గ్రామాలలో పచ్చదనం పరిశుభ్రత ఉండాలంటే బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామాలకు అవసరమైన రోడ్లు, డ్రైనేజీలు నిర్మించి, నీరు, కరెంటు అందించామని గుర్తు చేశారు. ఓట్లు అడిగే కాంగ్రెస్ పార్టీ నాయకులను మహిళలకు 2500, వృద్ధులకు 4 వేల పెన్షన్, తులం బంగారం, విద్యార్థినిలకు స్కూటీలు, ధాన్యానికి బోనస్, గ్యాస్ సబ్సిడీ, రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతు బీమా, నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఏమైనాయని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమములో గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, పలుస రమేష్ గౌడ్, నందిమల్ల అశోక్, కె మాణిక్యం, వేణు రెడ్డి, విజయ్ కుమార్, ధర్మా నాయక్, గంధం పరంజ్యోతి, శివన్న, చిట్యాల రాము, మాజీ కౌన్సిలర్స్ బండారు కృష్ణ, ఉంగ్లం. తిరుమల్, ప్రేమ్ నాథ్ రెడ్డి, స్టార్ రహీమ్, డాక్టర్ డ్యానియల్, జోహెబ్ హుస్సేన్, మంద రాము తదితరులు పాల్గొన్నారు.

