Thursday, January 15, 2026
EPAPER
Homeబిజినెస్Silver Imports | వెండిని భారీగా దిగుమతి చేసుకున్న ఇండియా

Silver Imports | వెండిని భారీగా దిగుమతి చేసుకున్న ఇండియా

మన దేశం గతేడాది భారీగా వెండిని దిగుమతి(Import) చేసుకుంది. వ్యూహాత్మకంగా ప్రాధాన్యత(Strategic Importance), పారిశ్రామికంగా గిరాకీ(Industrial Demand), ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (Geopolitical Tensions) పెరగటం తదితర పరిస్థితుల నేపథ్యంలో వెండి దిగుమతులు పెరిగాయి. ఈ విషయాన్ని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్(GTRI) తన నివేదికలో పేర్కొంది. శుద్ధి చేసిన వెండి విషయంలో ఇండియా అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. 2025లో 9.2 బిలియన్ డాలర్ల విలువైన వెండిని ఇంపోర్ట్ చేసుకొని ఉంటుందని అంచనా. 2024తో పోల్చితే ఇది 44 శాతం ఎక్కువ కావటం గమనార్హం. ధరలు పెద్దమొత్తంలో పెరిగినప్పటికీ ఈ స్థాయిలో దిగుమతి చేసుకోవటం విశేషం. ఇండియాలో వెండి రేట్లు గత ఏడాది కాలంలో మూడు రెట్లు పెరిగాయి. కేజీ ధర రూ.80-85 వేల నుంచి రూ.2.43 లక్షల వరకు చేరింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News