సీనియర్ నటి పావలా శ్యామల మరోసారి వార్తల్లో నిలిచారు. ఆరోగ్య(Health), ఆర్థిక (Financial) ఇబ్బందులు (Problems) చుట్టుముట్టడంతో ఆమె తన ప్రాణాలు తానే తీసుకోబోయారు. సకాలంలో స్పందించిన పోలీసులు(Police).. బాధితురాలి(Victim)ని రక్షించి హైదరాబాద్‌లోని ఓ ఛారిటబుల్ హోమ్(Charitable Home)కి తరలించారు. వసతి, భోజనం తదితర కనీస సౌకర్యాలు కల్పించారు. ఈ నేపథ్యంలో పావలా శ్యామలకు సినీ, దాతృత్వ సంస్థలు తక్షణం సహాయం అందించాలని, ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. పావలా శ్యామలతోపాటు ఆమె కూతురు సైతం ఆదాయం లేక, వైద్య సాయం అందక తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. మనుగడ కోసం పోరాడుతున్నారు.
ఇన్నాళ్లూ వాళ్లు ఉన్న ఇంటిని ఖాళీ చేయాలని సంబంధీకులు ఒత్తిడి చేయటంతో దిక్కులేని పరిస్థితుల్లో రోడ్డు మీదికి వచ్చారని తెలుస్తోంది. తలదాచుకోవటానికి గూడు లేక వీధుల్లో సంచరించాల్సి రావటంతో ఇక ఈ లోకంలో ఉండి ప్రయోజనం లేదనే కఠిన నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ హృదయ విదారక ఘటన ఆమె అభిమానుల్లో, ప్రజల్లో ఆవేదన, ఆందోళన, ఆగ్రహం కలిగిస్తోంది. దాదాపు 250కి పైగా చిత్రాల్లో నటించడం ద్వారా పావలా శ్యామల సినీ రంగానికి అందించిన గణనీయమైన సేవలను గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురవుతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ (Telugu Cine Industry) నుంచి మద్దతు లభిస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.
