జూబ్లీహిల్స్ (Jubileehills) శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) బుధవారం బోరబండ డివిజన్ ఫేజ్-1లో ఇంటింటి ప్రచారం (Door to Door Compaign) నిర్వహించింది. ఇందులో మంత్రి సీతక్క (Minister Seethakka), కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్(Naveen Yadav), కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ (Baba Fasiuddin) తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన(Praja Palana), అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించామని చెప్పారు.

ప్రజల సమస్యలు తీర్చడంలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ చేతి గుర్తుపైన ఓటు వేసి నవీన్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
