- బతికి బయటపడ్డ ఒకే ఒక్కడు అబ్దుల్ షోయబ్
- సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం
- డీజిల్ ట్యాంకర్ను ఢీకొన్న టూరిస్ట్ బస్సు
- మంటలు చెలరేగడంతో 46 మంది మృతి
- మృతలంతా హైదరాబాద్ పాతబస్తీ వాసులు
- మక్కాకు వెళుతుండగా ప్రమాదం
- సౌదీ ప్రమాద ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి
- సంతాపం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్
రూ. 5లక్షల ఎక్స్రేషియా అజారుద్దీన్ నేతృత్వంలో సౌదీకి ప్రభుత్వ బృందం.. అక్కడే అంత్యక్రియలకు ఏర్పాట్లు.. తెలంగాణ కేబినేట్ కీలక నిర్ణయం.. సౌదీ ప్రమాద బస్సు ఘటనపై రేవంత్ దిగ్భ్రాంతి.. వెంటనే వివరాలు సేకరించాలని సిఎస్కు ఆదేశం.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడి
సౌదీ అరేబియాలో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. మదీనాకు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది హైదరాబాదీలు మృతిచెందారు. యాత్రికులతో వెళ్తన్న బస్సు.. డీజిల్ ట్యాంకర్ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సౌదీ అరేబియాలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదీనాకు సమీపంగా భారీ రోడ్డు ప్రమాదం సంభవించింది. మక్కా నుంచి మదీనా వెళుతున్న యాత్రికుల బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి పెద్ద దుర్ఘటన చోటుచేసుకుంది.

ఈమంటల్లో హైదరాబాద్ కు చెందిన 45 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపిన వివరాల ప్రకారం 54 మంది యాత్రికుల బృందం నవంబర్ 9 న హైదరాబాద్ నుంచి జెడ్డాకు బయలు దేరింది. నవంబర్ 23 వరకు టూరు ప్లాన్ చేశారు. వారిలో నలుగురు ముందుగానే కారులో మదీనాకు వెళ్లగా, మరో నలుగురు మక్కాలోనే నిలిచిపోయారు. మిగిలిన 46 మంది బస్సులో ప్రయాణం కొనసాగించారు. మదీనా నుండి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో బస్సు చమురు ట్యాంకరు ఢీకొట్టడంతో ఒక్కసారిగా అగ్నిప్రమాదం చెలరేగిందని తెలిపారు.
డీజిల్ ట్యాంకర్ను ఢీకొనగానే మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. ప్రమాద సమయంలో యాత్రికులంతా నిద్రలో ఉండటంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో అబ్దుల్ షోయబ్ అనే యాత్రికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అతను ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా.. ఇతను హైదరాబాద్ నగరానికి చెందిన యువకుడిగా గుర్తించారు. ప్రమాదం సమయంలో షోయబ్ బస్సు డ్రైవర్ సమీపంలో కూర్చున్నందున ప్రమాదం నుంచి బయటపడగలిగాడు.
అయితే షోయబ్ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కొన్ని నివేదికల ప్రకారం.. ఈ ప్రమాదంలో షోయబ్ తన కుటుంబ సభ్యులలో చాలా మందిని కోల్పోయినట్లు తెలుస్తోంది. మరణించిన వారిలో మల్లేపల్లి, బజార్ ఘాట్, ఆసిఫ్ నగర్ ప్రాంతాల వారూ ఉన్నట్లు తెలుస్తోంది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 1.30 గంటల సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. యాత్రికులంతా నిద్రలో ఉండడం వల్ల మరణాలు అధికంగా నమోద య్యాయని అధికారులు భావిస్తున్నారు.
ప్రమాద స్థలంలో రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాలోని జెడ్డా భారత దౌత్య కార్యాలయం ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. 24 ఏళ్ల మొహమ్మద్ అబ్దుల్ షోయబ్ డ్రైవర్ పక్కన కూర్చోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. షోయబ్ హైదరాబాద్కు చెందిన వ్యక్తి. గాయాల పాలైన షోయబ్ను హాస్పిటల్లో చేర్చారు. అయితే అతడి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం బయటకు రాలేదు . ప్రమాదంలో షోయబ్ కుటుంబ సభ్యులందరూ చనిపోయినట్టు తెలుస్తోంది.
