Thursday, April 2, 2026
Homeరంగారెడ్డిDevelopment | ప్రజల కష్టాలను తీర్చడమే నా ధ్యేయం

Development | ప్రజల కష్టాలను తీర్చడమే నా ధ్యేయం

  • సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్….

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం, బండరావిరాల గ్రామంలో ప్రజల మరియు రైతుల విద్యుత్ కష్టాలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా బండరావిరాల గ్రామ సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్, మరో కీలక అడుగు వేశారు. గ్రామంలోని ఇందిరానగర్ కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా వేధిస్తున్న కరెంట్ సమస్యను అధిగమించేందుకు ఆయన ప్రత్యేక చొరవతో మంజూరు చేయించిన నూతన 100 KV ట్రాన్స్‌ఫార్మర్‌ను గురువారం విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ప్రారంబించారు.

ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ADE శ్రీనివాస్, AE నరేందర్ మాట్లాడుతూ గ్రామంలో పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా సర్పంచ్ విజయ్ కుమార్ మా దృష్టికి తీసుకువచ్చిన సమస్యను పరిష్కరిస్తూ 100 KV ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశాం. దీనివల్ల వోల్టేజ్ సమస్యలు తొలగి రైతులకు గృహ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందుతుంది అని తెలిపారు.

- Advertisement -

అనంతరం సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్ మాట్లాడుతూ గ్రామ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా మేము నిరంతరం శ్రమిస్తున్నాం. ముఖ్యంగా విద్యుత్ నిరంతర అంతరాయం వలన విద్యార్థులు పరీక్షల సమయంలో విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకూడదని, వేసవి కాలంలో గృహ వినియోగదారులకు నిత్యం నాణ్యమైన విద్యుత్ సరఫరా అందాలనే ఉద్దేశంతో ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించాం.

ప్రజా అవసరాలను గుర్తించి మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం నా బాధ్యతగా భావిస్తున్నాను. రానున్న రోజుల్లో అందరి సహకారంతో బండరావిరాల గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం అని పేర్కొన్నారు. అలాగే ఎన్నో ఏండ్లుగా ఉన్న ఈ సమస్యను అధికారుల దృష్టికి తేవడముతో వారు సానుకూలంగా స్పందించి ట్రాన్స్‌ఫార్మార్ ని ఏర్పాటు చేసినందుకు విద్యుత్ అధికారులను గ్రామ పాలక మండలీ తరుపున సన్మానం చేసారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దూస శంకర్, వార్డు సభ్యులు ఏర్పుల హరికృష్ణ, గుండ్ల భవాని – శివ ముదిరాజ్, కందికంటి అనూష – ప్రవీణ్, కన్నె భరత్ యాదవ్, గ్రామ యువ నాయకులు గుండ్ల సతీష్ యాదవ్, చింతకింది రాజు యాదవ్, మంకిరి యాదగిరి, కన్నె లింగస్వామి, నెమరుగోముల కరుణ్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లైన్‌మెన్ రామచందర్, హెల్పర్ లింగం, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News