Tuesday, February 17, 2026
Homeహైదరాబాద్‌Saroornagar | సరూర్‌నగర్-3 సర్కిల్ అసిస్టెంట్ కమిషనర్

Saroornagar | సరూర్‌నగర్-3 సర్కిల్ అసిస్టెంట్ కమిషనర్

  • కార్యాలయం నూతన భవనంలోకి మార్పు.

సరూర్‌నగర్ డివిజన్ పరిధిలోని అసిస్టెంట్ కమిషనర్ (రాష్ట్ర పన్నులు), సరూర్‌నగర్-3 సర్కిల్ కార్యాలయం సోమవారం నాడు నూతన ప్రాంగణంలోకి మార్చబడింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు, ఇప్పటివరకు మయూర్ కుశాల్ టవర్స్‌లో ఉన్న ఈ ప్రైవేట్ భవన కార్యాలయాన్ని నాంపల్లిలోని గగన్ విహార్ ఆఫీస్ కాంప్లెక్స్, 2వ అంతస్తులోకి తరలించారు.

ఈ నూతన కార్యాలయాన్ని సరూర్‌నగర్ డివిజన్ జాయింట్ కమిషనర్ (ST) పి. నయనార్ రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఇక కార్యాలయ కార్యకలాపాలన్నీ నాంపల్లిలోని గగన్ విహార్ ప్రాంగణం నుండే కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో సరూర్‌నగర్-3 సర్కిల్ అసిస్టెంట్ కమిషనర్ బి. శ్యామ్, ఇతర శాఖా సిబ్బంది పాల్గొన్నారు. పన్ను చెల్లింపుదారులు, సంబంధిత వ్యక్తులు ఈ మార్పును గమనించి, ఇకపై పాత భవనానికి కాకుండా నాంపల్లిలోని నూతన కార్యాలయాన్ని సంప్రదించవలసిందిగా కోరడమైనది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News