- పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్.
గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోరాట వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ మాట్లాడుతూ, పీడిత వర్గాల కొరకు పోరాటాలు చేసిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. ఇటువంటి మహనీయుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించడం గొప్ప విషయం అని అన్నారు.

ఈ వర్ధంతి కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, బిసి, మైనారిటీల సంక్షేమ అధికారులు శ్రీనివాస్, మోహన్ సింగ్, డీఈవో భోజన్న, పలువురు కుల సంఘాల నాయకులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
