ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని గిరిజన కోఆపరేటివ్ సెంటర్(Girijana Cooperative Center-GCC) కార్యాలయంలో శాండ్ బజార్‌ను ఏర్పాటుచేశారు. ప్రజల ప్రయోజనాల కోసం దీన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే (Khanapur Mla) వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bojju Patel) అందుబాటులోకి తెచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల(Indiramma Indlu) లబ్ధిదారులు, స్థానికలకు ఇసుక సులభంగా లభించేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ మైనింగ్ కార్పొరేషన్ (Mining Corporation) సహకారంతో ఏర్పాటైన ఈ శాండ్ బజార్ ద్వారా ఇసుక కొరత తీర్చారు. ట్రాక్టర్ (Tractor) యజమానులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా సౌకర్యాలు ఏర్పాటుచేశారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పేర్కొన్నారు.

