Thursday, March 5, 2026
Homeహైదరాబాద్‌Sajjanar | అదే అసలైన పండుగ

Sajjanar | అదే అసలైన పండుగ

హైదరాబాద్ పోలీస్ కమిషనర్(Hyderabad Police Commissioner) వీసీ సజ్జనార్ వాహనదారులకు పలు సలహాలు సూచనలు ఇచ్చారు. పొగమంచు(Fog)లో వాహనాలతో సాహసం వద్దు అని, మంచు తగ్గాకే వెళ్లాలని పేర్కొన్నారు. సంక్రాంతి సంబరం విషాదం కాకూడదని, పండుగ(Festival) నాడు పల్లెకు చేరాలన్న ఆత్రుత మీ ప్రాణాల మీదకు తేకూడదని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కమ్మేసిన దట్టమైన పొగమంచు మృత్యువు(Death)కు ముసుగులా మారింది. ఎదురుగా ఏముందో కనిపించని ఈ పరిస్థితిలో డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరం. పొగమంచులో సొంత వాహనాల్లో ప్రయాణం వద్దు. తెల్లవారుజామున లేదా అర్ధరాత్రి వేళల్లో సాహసం చేయకండి. దయచేసి పొగమంచు పూర్తిగా తగ్గి, రోడ్డు స్పష్టంగా కనిపించిన తర్వాతే మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. మీ రాక కోసం మీ వాళ్లు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. వారి కళ్లలో ఆనందాన్ని నింపండి. కన్నీళ్లను కాదు. పొగమంచు ఉన్నప్పుడు వాహనం నడపాల్సి వస్తే ఫాగ్ లైట్లు(Fog Lights), ఇండికేటర్లు ఆన్ చేయండి. ముందు వెళ్లే వాహనానికి తగినంత దూరం(Safe Distance) పాటించండి. రోడ్డు ఖాళీగా ఉందని వేగంగా వెళ్లొద్దు. గుర్తుంచుకోండి.. ఆలస్యంగానైనా సరే.. క్షేమంగా ఇంటికి చేరడమే నిజమైన పండుగ.

- Advertisement -
RELATED ARTICLES

Latest News