Monday, October 27, 2025
ePaper
Homeతెలంగాణసాయికృపకు అందరూ పాత్రులు కావాలి

సాయికృపకు అందరూ పాత్రులు కావాలి

  • ఘనంగా సాయిబాబా ఆలయ 9వ వార్షికోత్సవం
  • ఖాజాగుడ సాయి ఆలయంలో ప్రత్యేక పూజలు
  • 1000 మందికి అన్నధాన కార్యక్రమం

సాయికృపకు ప్రతి ఒక్కరు పాత్రులు కావాలని ఖాజాగూడ సాయిబాబ దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్‌ వెంకటనర్సింహా మూర్తి అన్నారు. ఖాజాగూడలోని సాయి ఐశ్వర్య రెసిడెన్సి ఆధ్వర్యంలో మంగళవారం నాడు శ్రీ సాయిబాబ ఆలయ నవమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో భజనలు, స్వామి వారి పాటలను ఆలపిస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయ్యారు. ఆనంతరం కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నధాన కార్యక్రమం చేపట్టారు. సుమారు 1000మందికి కమిటీ సభ్యులు అన్నధాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్‌ వెంకటనర్సింహా మూర్తి మాట్లాడుతూ ప్రతి ఏడాది స్వామి వారి వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ఏడాది కూడా ఆలయంలో స్వామివారి వార్షికోత్సవం సందర్భంగా పెద్దఎత్తున అన్నధాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే పండుగలు ఇతర ముఖ్యమైన రోజులలో కూడా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి నిత్యం భక్తులు కూడా పెద్దఎత్తున ఆలయానికి తరలివస్తుంటారని చెప్పారు. ఆలయంలో ప్రతి నిత్యం కూడా స్వామి వారికి హరతిసేవలు, భజనలు, పంచామృతభిషేకాలు, పల్లకిసేవా వంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఏలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అయన వివరించారు. అదేవిధంగా స్వామి వారి వార్షికోత్సవం సందర్భంగా కూడా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భిక్షల్‌ రావు, బందు రాంరెడ్డి, ఆశోక్‌రాజు, సదానంద్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News