Friday, February 13, 2026
Homeఅంతర్జాతీయంModi-Putin | మోదీ-పుతిన్ సంయుక్త మీడియా సమావేశం

Modi-Putin | మోదీ-పుతిన్ సంయుక్త మీడియా సమావేశం

ప్రస్తుతం మన దేశంలో పర్యటిస్తున్న రష్యా అధ్యక్షుడు(Russia President) వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin).. ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌(Hyderabad House)లో ప్రధాని మోదీ(PM Modi)తో భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు ముఖ్యాంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు(Agreements) కుదిరాయి. అనంతరం మోదీ, పుతిన్ కలిసి మీడియా సమావేశం(Combined Media Meeting)లో పాల్గొన్నారు. ప్రధాని మోదీతో నిర్మాణాత్మక చర్చలు జరిపినట్లు పుతిన్ పేర్కొన్నారు.

ప్రపంచ సమస్యలపై పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నామని చెప్పారు. రెండు దేశాల మధ్య రవాణా అనుసంధానం పెంచాలని, ఈ మేరకు ఇంటర్నేషనల్ నార్త్, సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్‌ను ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ ఇండియా, రష్యా స్నేహం శాశ్వతమని తెలిపారు. ఆర్థిక ప్రణాళికపై 2030 వరకు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పారు. అంతకుముందు రాష్ట్రపతిభవన్‌కు చేరుకున్న పుతిన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సాదరంగా ఆహ్వానించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News