Tuesday, March 24, 2026
Homeరంగారెడ్డిRTC | రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

RTC | రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

  • ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ అండ్ సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు ఎం.వి.కృష్ణ

ఆర్.టి.సి రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ అండ్ సీనియర్ సిటిజన్స్ ఫోరం ( తెలంగాణ) అధ్యక్షుడు ఎం.వి కృష్ణ ఆధ్వర్యంలో మల్కాజిగిరి లోక్ సభ సభ్యుడు ఈటెల రాజేందర్ ని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంక్షేమంతో పాటు అభివృద్ధిలో ఆర్.టి.సి ఉద్యోగుల సేవలను గుర్తించి హయ్యర్ పెన్షన్ల విషయంలో తమకు న్యాయం చేయాలని కోరారు. అలాగే శాఖ పరమైన ఇతర సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుని తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. నాగేశ్వరరావు, సభ్యుడు రావి కృష్ణారెడ్డి,విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News