మేడ్చల్ డీసీపీ ఎన్.కోటిరెడ్డి వెల్లడి
రౌడీ షీటర్ రౌషన్ కుమార్ సింగ్ హ* కేసు నిందితులను పోలీసులు (Police) అదుపులోకి తీసుకొని (Arrest) రిమాండ్(Remand)కు పంపారు. వారి నుంచి కత్తి, సెల్‌ఫోన్, బుల్లెట్ (Bullet) వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సైబరాబాద్ కమిషనరేట్ జగద్గిరిగుట్ట స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. కేసు వివరాలను మేడ్చల్ డీసీపీ ఎన్.కోటిరెడ్డి వెల్లడించారు. జగద్గిరిగుట్ట బస్తీకి చెందిన టి.బాలషోవరెడ్డి అలియాస్ బాద్‌షా(21)పై స్థానిక పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్ ఉంది. అదే బస్తీకి చెందిన షరీఫ్‌తో గొడవలు ఉన్నాయి.
షరీఫ్ స్నేహితుడు రోషన్ కుమార్ సింగ్. ఆటోడ్రైవర్. ఇతనిపైనా బాలానగర్ పోలీస్ స్టేషన్(Balanagar Police Station)లో రౌడీ షీట్ ఉంది. షరీఫ్‌పై పగపెంచుకున్న విషయం తెలుసుకున్న మృతుడు రౌషన్ కుమార్ సింగ్.. బాలషోవరెడ్డికి వార్నింగ్ (Warning) ఇస్తూ నీ ప్రాణం తీస్తా అని బెదిరించాడు. దీంతో బాలషోవరెడ్డి ప్రతీకారం తీర్చుకోవాలని కసి పెంచుకున్నాడు. ఆన్‌లైన్‌లో కత్తి కొనుగోలు చేసి రోషన్ కుమార్ సింగ్‌ను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ ప్రణాళికను జగద్గిరిగుట్టకు చెందిన తన స్నేహితులు సయ్యద్ మహామూద్(28), రేవ్యు ఆదిత్య అలియాస్ ఆదీల్(26)కు చెప్పడంతో వారు కూడా ఇందులో పాల్గొన్నారు.
నిన్న బుధవారం రౌషన్ కుమార్ సింగ్‌ను జగద్గిరిగుట్ట బస్టాప్‌కు రావాలని సూచించారు. ముగ్గురూ కలిసి ద్విచక్రవాహనంపై అక్కడికి చేరుకున్నారు. బాలషోవరెడ్డితో మాట్లాడుతున్న సమయంలో వెనక నుంచి వచ్చిన మహమూద్ గట్టిగా పట్టుకున్నాడు. దీంతో వెంట తెచ్చిన కత్తితో బాలాషోవరెడ్డి.. రోషన్‌పై దాడి చేసి కడుపులో, ఛీతీలో, మెడ వెనక భాగంలో పొడిచాడు. దీంతో.. తీవ్ర రక్తస్రావమై రోడ్డుపై పడిన వెంటనే నిందితులు బుల్లెట్ వాహనంపై పారిపోయారు.
విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితుణ్ని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతిచెందాడు. ఈ కేసులో నిందితులైన బాలషోవ రెడ్డి, సయ్యద్ మహమూద్, రెవుఆదిత్య ఆదీల్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా పాత నేరస్థులైన వీరిపై పలు పోలీస్ స్టేషన్‌లో కేసులు ఉన్నాయని తెలింది. దీంతో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
