- జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి..
ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడంలో మైక్రో అబ్జర్వేర్ల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ అన్నారు. గురువారం ఐడిఓసి సమావేశ మందిరంలో మైక్రో అబ్జర్వేర్ల కు నిర్వహించిన సమావేశంలో ఎన్నికల సాధారణ పరిశీలికులు పరిశీలికులు మల్లయ్య బట్టు, వ్యయ పరిశీలకులు శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడారు. పోలింగ్ ప్రక్రియ ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జరుగుతుందా లేదా అనేది పరిశీలిన చేయడం మైక్రో అబ్జర్వేర్ల ప్రధాన బాధ్యత అని, అలా కాకుండా పిఓలు ఏపీఓల విధుల్లో జోక్యం చేసుకోరాదని, గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉంటే అబ్జర్వేర్లకు తెలియజేయాల్సిన బాధ్యత మైక్రో అబ్జర్వేర్లపై ఉంటుందని సూచించారు.

పోలింగ్ విధానాన్ని పరిశీలిస్తూ, ఎలాంటి తప్పిదాలు, ఉల్లంఘనలు జరిగిన ఎన్నికల పరిశీలకుల దృష్టికి మైక్రో అబ్జర్వర్లు తీసుకురావాలని, పోలింగ్ విధానాన్ని నిశితంగా పరిశీలించి మైక్రో అబ్జర్వేర్లు ఇచ్చిన ఫార్మాట్లోనే నివేదిక సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పోలింగ్ రోజున ఉదయం 6:00 గంటలకల్లా మైక్రో అబ్జర్వేర్లు నిర్దేశించిన పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలని ఆదేశించారు. సాధారణ పరిశీలికులు మల్లయ్య బట్టు మాట్లాడుతూ.. పోలింగ్ ప్రక్రియ నిర్వహణలో మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల కమిషన్ కు కళ్ళు, చెవుల మాదిరి పనిచేయాలని సూచించారు. ఎన్నికల పోలింగ్ నిర్వహణకై మైక్రో అబ్జర్వేర్ల పాత్ర కీలకమని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శివకుమార్, ట్రైనర్ శ్రీనివాసులు, జెడ్పి సీఈవో p రామ మహేశ్వర్, డి పి ఆర్ ఓ సీతారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

