గుజరాత్‌లో బీజేపీ సర్కారు చేపట్టిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేజాకు చోటు దక్కింది. 26 మందితో కూడిన కొత్త క్యాబినెట్ అక్టోబర్ 17న ప్రమాణ స్వీకారం చేసింది. గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో వీరితో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణం చేయించారు. హోం శాఖ మంత్రి హర్ష్ సంఘవి డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. శాసనసభ ఎన్నికల ముందు సామాజిక, ప్రాంతీయ ప్రాతినిధ్యాన్ని సమతుల్యం చేయడం, ప్రభుత్వంలో కొత్త శక్తిని నింపడం కోసం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జామ్ నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
