Monday, October 27, 2025
ePaper
HomeతెలంగాణTRTF | టెట్‌పై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్

TRTF | టెట్‌పై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్

సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులు (Teachers) సైతం టెట్ (TET) పరీక్ష ఉత్తీర్ణత సాధించాలని పేర్కొంటూ సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన ఉత్తర్వులను పునఃసమీక్ష చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (TRTF) పక్షాన శుక్రవారం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ (Review Petition) దాఖలు చేసినట్లు సంస్థ రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2017లో సవరించిన ఆర్టీఈ (RTE) చట్టం 23(2) కారణంగానే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై పూర్తి స్థాయిలో సమీక్షించి సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత నుంచి మినహాయింపు ఇవ్వాలని రివ్యూ పిటిషన్‌లో సుప్రీంకోర్టును అభ్యర్థించినట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News