Thursday, March 5, 2026
Homeహైదరాబాద్‌Revanth Reddy | నైతికతని నిలబెట్టుకున్నాం

Revanth Reddy | నైతికతని నిలబెట్టుకున్నాం

  • నవీన్ యాదప్ని గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి పనులు చేస్తాం
  • జూబ్లీహిల్స్లో రూ.400 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు
  • నాలుగు వేల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తాం
  • మూసీ రివర్ ఫ్రంట్ ఎందుకు కట్టకూడదో కిషన్రెడ్డి చెప్పాలి
  • సవాల్ విసిరి పారిపోవడం కేటీఆర్కు అలవాటైపోయింది
  • షేక్పేట్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్రెడ్డి

జూబ్లిహిల్స్ ఉపఎన్నిక ప్రచారాన్ని ఉదృతం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సోమవారం షేక్పేట ప్రాంతంలో ప్రజలను కలుసుకుని బహిరంగ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీనే మైనారిటీలకు నిజమైన పక్షపాతి అని ఆయన స్పష్టం చేశారు. “లౌకికత, ప్రజాస్వామ్య విలువలకు అర్థం చెప్పి వాటిని శాశ్వతంగా నిలబెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీనే” అని రేవంత్ పేర్కొన్నారు. “రాహుల్ గాంధీ, నేనూ ఒక వైపు… మోదీ, కేసీఆర్ మరో వైపు ఉన్నారు. ఈ ఉపఎన్నిక చూడటానికి చిన్నదిగా అనిపించవచ్చు కానీ బీజేపీ-బీఆర్ఎస్ ల రహస్య మంతనాలు, చీకటి స్నేహాలు, మైనారిటీలపై జరుగుతున్న కుట్రలపై పోరాడేందుకు ఇది ఒక చారిత్రాత్మక అవకాశం” అని ఆయన వ్యాఖ్యానించారు.

జూబ్లిహిల్స్ అభివృద్ధి పనులపై మాట్లాడుతూ “ఈ నియోజకవర్గంలో రూ.400 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నాలుగు వేల ఇందిరమ్మ ఇళ్లు త్వరలో నిర్మిస్తాం. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధిస్తే, మరిన్ని ప్రాజెక్టులు ప్రారంభిస్తాం.” అని సీఎం రేవంత్ తెలిపారు. భాజపా, బీఆర్ఎస్ పై రేవంత్ తీవ్రంగా దాడి చేశారు. “బీఆర్ఎస్ పేరుతో భాజపా ఓట్లు అడుగుతోంది. ముస్లింలను బీఆర్ఎస్ మోసం చేస్తోంది. మోదీ, కేసీఆర్ ఇద్దరూ ఒకే నాణెం రెండు వైపులు. కిషన్ రెడ్డి మూసీ రివర్ ఫ్రంట్ ఎందుకు కట్టలేదో సమాధానం చెప్పాలి. అజారుద్దీన క్కు మంత్రి పదవి ఇవ్వడంపై అభ్యంతరం ఎందుకు?” అని ప్రశ్నించారు. “కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీలకు ఎన్నో అవకాశాలు కల్పించాం.

- Advertisement -

కొడంగల్ లో నేను మూడుసార్లు గెలవడానికి మైనార్టీలే బలంగా నిలబడ్డారు. గత 20 నెలల్లో మైనార్టీలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసాం” అని రేవంత్ అన్నారు. కేసీఆర్ పాలనను విమర్శిస్తూ “గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వలేకపోయాడు. కేటీఆర్ సవాలు విసిరి పారిపోవడం అలవాటే. ఇప్పుడు ప్రజలు తీర్పు నిచ్చే సమయం వచ్చింది” అని అన్నారు. జూబ్లిహిల్స్ గెలుపు మన నగరాభివృద్ధికి, అందరికీ సమాన అవకాశాల కల్పనకు, ప్రజా ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికల అమలుకు ప్రోత్సాహకంగా మారాలని రేవంత్ పిలుపునిచ్చారు. “కుల, మతాలకు అతీతంగా జూబిలీహిల్స్ ఓటర్లందరూ సరయిన నిర్ణయం తీసుకోవాలి” అని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, అజారుద్దీన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు: మండిపడ్డ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సందర్భంగా తనపై బీఆర్ఎస్ తప్పుడు ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు తనపై తప్పుడు నిందలు వేస్తూ, అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ప్రజలు దొంగ సర్వేలను నమ్మరని పేర్కొన్నారు. ప్రజలకు తాను ఎల్లవేళలా అందుబాటులో ఉన్నానని. గతంలో ఓటమి చెందినా ప్రజలతో మమేకం అయ్యానని నవీన్ యాదవ్ మాట్లాడారు. తాను చదువుకున్న వ్యక్తినని, ప్రజల కోసం నిజాయితీగా పని చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు.

గతంలో తమ గల్లీకి ఎమ్మెల్యే కూడా రాలేదని, ఇప్పుడు సీఎం వస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి తనను కుడి భుజంగా భావించడం తమ అదృష్టమని ఆయన పేర్కొన్నారు. తన తండ్రి గతంలో కేసీఆర్కు సహాయం చేశారన్న నవీన్ యాదవ్, కేసీఆర్ తమ ఇంటికి వచ్చి సహాయం అడిగారని, శత్రువు ఇంటికి వచ్చినా సహాయం చేస్తామని నవీన్ యాదవ్ అన్నారు. 2018లో తనకు అవకాశం ఇవ్వకుండా బీఆర్ఎస్ అడ్డుకుందని ఆయన విమర్శించారు. తనపై వస్తున్న విమర్శలను పట్టించుకోనని, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఆధారంగా ఓట్లు అడగాలని ఆయన సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News