Thursday, February 12, 2026
Homeఆరోగ్యంLaryngitis | గొంతు నొప్పికి కారణాలు.. ఉపశమన మార్గాలు..

Laryngitis | గొంతు నొప్పికి కారణాలు.. ఉపశమన మార్గాలు..

వాతావరణంలో వచ్చిన మార్పుల(Weather Change) వల్ల ఇంటికొకరు చొప్పున గొంతు గరగరతో సరిగ్గా మాటలు రాక గొంతునొప్పితో బాధపడుతున్నారు. కొందరికి మాట పెగలడం కష్టమైపోతోంది. సైగలతో సరిపెడుతున్నారు. ఇంకొందరు మళ్లీ మాట్లాడతామంటూ వెళ్లిపోతున్నారు. సెల్‌ఫోన్లలో చాటింగ్‌కు ప్రాధాన్యమిస్తున్నారు. ఇదంతా ఎందుకంటే.. వాళ్ల గొంతులన్నీ బొంగురుపోయాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు బాధితులు(Victims) క్యూ కడుతున్నారు.

వాతావరణంలో మార్పులు, చలిగాలులు, కాలుష్యం, ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థాలతో ఏర్పడిన గాలిని(Polluted Air) పీల్చడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. వీటితో ఇటీవల గొంతు నొప్పి(Laryngitis-లారిన్‌‌గైటిస్)తో బాధపడుతున్నవారి సంఖ్య బాగా పెరిగింది. ప్రధానంగా వాతావరణంలో మార్పులతో గొంతులో ఇన్‌ఫెక్షన్‌(Infection) కారక సూక్ష్మక్రిములు చేరడం వల్ల ఈ నొప్పి మొదలవుతుందని డాక్టర్లు అంటున్నారు. ఇలా గొంతు నొప్పితో బాధపడుతున్నవారు లక్షల సంఖ్యలో ఉన్నారు.

- Advertisement -

గత పది రోజులుగా గొంతు నొప్పి బాధితుల తాకిడి బాగా పెరిగిందని డాక్టర్లు చెబుతున్నారు. గత 20 రోజుల వ్యవధిలో దాదాపు లక్షల మంది వైద్యం పొందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటి వల్ల జ్వరం, జలుబు, దగ్గు, టాన్సిల్‌ వాపు వస్తోంది. మింగేటప్పుడు, మాట్లాడేటప్పుడు గొంతులో నొప్పిగా ఉంటుంది. గొంతు గరగరమంటూ బొంగురుపోతుంది. గొంతులో మంట వచ్చి, ఆహార పానీయాలు తీసుకోవడం కష్టంగా అనిపిస్తోంది.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడటం, పొడి దగ్గు, మెడ చుట్టూ వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాలుష్యం, పొగ, ధూళికి ఎక్కువగా గురికావడం వల్ల గొంతు నొప్పి వస్తుంది. గొంతు, నాలుక, స్వరపేటికలో వచ్చే అల్సర్లు కూడా గొంతు నొప్పికి కారణమవుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక్కసారి గొంతు నొప్పి బారినపడిన బాధితులు వ్యాధి తీవ్రత పెరగకుండా ఉండటానికి ఇంటి చిట్కాలు ఐదు నుంచి వారం రోజుల పాటు వాడితే చాలు.

రోజూ కనీసం 5 నుంచి 10 సార్లు గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి పుక్కిలించాలి. వేడి పాలు, సూప్‌లు, నిమ్మరసం కలిపిన నీరు తాగడం మంచిది. అల్లం టీ లేదా తేనె తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది. సలసల కాగిన నీటిలో పసుపు, జండూబామ్‌ వేసి ఆవిరి పీల్చడం వల్ల శ్వాస పీల్చడం సులభమవుతుంది. ఒక వేళ శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే మాత్రం తక్షణం సమీపంలోని ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించాలి.

నిర్లక్ష్యంగా వదిలేస్తే వ్యాధి తీవ్రత పెరిగి నిమోనియాకు దారి తీసే అవకాశాలున్నాయి. వీలైనంత వరకు గట్టిగా మాట్లాడకుండా ఉండటం మంచిది. గొంతు నొప్పి నివారణకు డాక్టర్ల సలహాలు, సూచనలు పాటిస్తూ మందులు వాడదాం. గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందుదాం.

  • కామిడి సతీష్ రెడ్డి
- Advertisement -
RELATED ARTICLES

Latest News