- ఇంటిబాట పట్టిన లక్నో, ముంబై..
ఐపీఎల్ 2026 సీజన్‌లో సూపర్ సండే మ్యాచ్‌లు పాయింట్ల పట్టికను పూర్తిగా మార్చేశాయి. వరుసగా రెండు ఓటముల తర్వాత తిరిగి పుంజుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ముంబై ఇండియన్స్‌పై ఉత్కంఠ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ కూడా భారీ లక్ష్యాన్ని ఛేదించి ప్లే ఆఫ్స్ రేసులో బలంగా నిలిచింది. ఆదివారం జరిగిన రెండు కీలక మ్యాచ్‌లు పాయింట్ల పట్టికపై భారీ ప్రభావం చూపించాయి. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌పై విజయం సాధించి ఐదో స్థానానికి ఎగబాకింది. అదే సమయంలో లక్నో సీజన్ నుంచి అధికారికంగా నిష్క్రమించింది.
- Advertisement -
