నల్గొండ పోక్సో కోర్టు మరో సంచలన తీర్పు
నల్గొండ పోక్సో కోర్టు (Nalgonda Pocso Court) మరో సంచలన తీర్పు ఇచ్చింది. మైనర్(Minor)ను గర్భవతి(Pregnant)ని చేసిన కేసులో నిందితుడికి 21 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. రూ.30 వేల జరిమానా (Fine) కూడా వేసింది. బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం (Compensation) ఇవ్వాలని తుది తీర్పులో వెల్లడించింది. ఈ ఘటన 2021లో నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చింతపల్లి నగేష్ అనే వ్యక్తి.. చెల్లి(పెద్దమ్మ కూతురు)పై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలికి తల్లిదండ్రులు కూడా లేకపోవటం గమనార్హం.
