Saturday, March 28, 2026
Homeరంగారెడ్డిUrea | రబీ పంటలకు సరిపడా యూరియాను సకాలంలో అందించాలి

Urea | రబీ పంటలకు సరిపడా యూరియాను సకాలంలో అందించాలి

  • యూరియా కొరత లేకుండా రైతులను ఆదుకోవాలి.

రవి సీజన్ లో వేస్తున్న పంటలకు సరిపడా యూరియాను సకాలంలో అందుబాటులో ఉంచాలని జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు కడియాల వీరాచారి డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదిక సమీపంలో వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీకాంత్ కు జిల్లా రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వీరాచారి మాట్లాడుతూ గత వర్షాకాలం సీజన్లో పత్తి పంట, వరి పంటలకు గాని సరిపడా యూరియా బస్తాలు లేక రైతులు చాలా ఇబ్బందులకు గురైయ్యారన్నారు.

యూరియా దొరకక పత్తి, వరి పంటలు దిగుబడి తగ్గి రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారన్నారు. పత్తి పంట ఎకరానికి రెండు మూడు క్వింటాల దిగుబడి రాక పెట్టుబడి సైతం నష్టపోయి పరిస్థితి ఏర్పడిందని, దిగుబడి రాకపోవడానికి ప్రధాన కారణం వర్షాలు దానికి తోడు సరిపడా యూరియా లేకపోవడమే అని తెలిపారు. రబీ సీజన్లో వరి,మొక్కజొన్న పంటలకు సరిపడా యూరియా సమకూర్చాలని మండల ఏఈవో కు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News