రాజకీయ పార్టీలు ఎన్నికల నాడు ప్రజల బాట-మాట. ఆ తర్వాత అంతా స్వార్థం కోసం, తమ లాభం కోసం, తమ గద్దె కోసం మాత్రమే పనిచేస్తారు.. జనాలు మాత్రం పార్టీల జెండాలకు కట్టుబడి, ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకుంటూ అసలు సమస్యలను పూర్తిగా పక్కకు నెట్టి వేస్తున్నారు.ఇది బానిసత్వం తప్ప మరేమీ కాదు.గొర్రెల మందలా నడవడం ఆపాలి. ఒక్కటిగా నిలబడి నాయకుల విధానాల, నినాదాల, మాటల, వంచనల వెనుక దాగిన అసలు స్వార్థాన్ని బట్టబయలు చేయాలి.. వారి బాధ్యతలను తప్పించుకునే అవకాశం ఇవ్వకూడదు?. నేడు జరుగుతున్నది- ప్రజల విభజన,నాయకుల లాభం.. ఇది చేదించాలంటే ఐకమత్యం అనివార్యం. ప్రజాశక్తి ముందు ఏ పార్టీ, ఏ నేతా నిలువ లేరు.
- మేదాజీ
- Advertisement -
