Sunday, February 15, 2026
HomeసినిమాIrumudi | మూవీ నుంచి కావేరి గా ప్రియా భవానీ శంకర్ ఫస్ట్ లుక్

Irumudi | మూవీ నుంచి కావేరి గా ప్రియా భవానీ శంకర్ ఫస్ట్ లుక్

మాస్ మహారాజా రవితేజ తన ల్యాండ్‌మార్క్ 77వ ప్రాజెక్ట్ ‘ఇరుముడి’ కోసం సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణతో చేతులు కలిపారు.  ఈ చిత్రాన్ని ప్రముఖ పాన్-ఇండియన్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.  ఈ కొలాబరేషన్  ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయ్యింది. రవితేజ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన లభించింది. ఈరోజు, మహా శివరాత్రి శుభ సందర్భంగా, మేకర్స్ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

ఈ పోస్టర్‌లో ప్రియా భవానీ శంకర్‌ను కావేరీగా పరిచయం చేశారు.  రవితేజ రగ్గడ్ లుక్‌లో ఆమె చెంపపై ప్రేమగా ముద్దుపెడుతూ కనిపించగా, ఇద్దరి మధ్య ఉన్న ఆప్యాయతను పోస్టర్ అందంగా చూపిస్తోంది. ఫుల్ బియర్డ్, క్యాజువల్ స్ట్రైప్డ్ షర్ట్‌తో గ్రామీణ నేపథ్యంలో ఆయన లుక్ ప్రత్యేకంగా నిలిచింది.

- Advertisement -

మరోవైపు సంప్రదాయ మారూన్ చీరలో ప్రియా భవానీ శంకర్ సహజమైన చిరునవ్వుతో ఆకట్టుకుంటున్నారు. పూలతో అలంకరించిన జుట్టు, మినిమల్ జ్యువెలరీ ఆమె రూరల్ పాత్రకు మరింత అందాన్ని తెచ్చాయి. అరటిపళ్లతో నిండిన బండి బ్యాక్‌డ్రాప్‌లో ఎర్తీ టోన్స్, సాఫ్ట్ లైటింగ్‌తో ఈ పోస్టర్ ఒక మనసుని హత్తుకునే గ్రామీణ ప్రేమకథను సూచిస్తోంది.

శివ నిర్వాణ ఇంటెన్స్, ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ పవర్ ఫుల్ కథని సిద్ధం చేశారు. ముఖ్యంగా తండ్రి–కూతురు అనుబంధం ఈ చిత్రానికి హైలెట్ గా ఉండబోతుంది. రవితేజ గత సినిమాలకంటే భిన్నంగ  కొత్త ఎమోషనల్ షేడ్స్‌తో కూడిన పాత్రలో కనిపించబోతున్నారు.

ఈ చిత్రంలో ప్రతి పాత్రను బలంగా తీర్చిదిద్దారు. బేబీ నక్షత్ర రవితేజ కుమార్తెగా నటిస్తుండగా, సాయి కుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, స్వాసిక కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీకి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా, సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైన్, ప్రవీణ్ పూడి ఎడిటర్. కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ను శివ నిర్వాణే అందించగా, నరేష్ బాబు పి  స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్ గా పని చేస్తున్నారు.

ప్రస్తుతం ‘ఇరుముడి’ షూటింగ్ శర వేగంగా కొనసాగుతూ, ప్రొడక్షన్ సాఫీగా ముందుకు సాగుతోంది.

నటీనటులు: మాస్ మహారాజా రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, బేబీ నక్షత్ర, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, రమణ భార్గవ్, కిషోర్ కంచెరపాలెం, కార్తీక్ అడుసుమల్లి, మహేష్

సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
DOP: విష్ణు శర్మ
ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్: నరేష్ బాబు పి
కో-డైరెక్టర్: సురేష్
మేకప్: శ్రీనివాస్ రాజు
కాస్ట్యూమర్ డిజైనర్: రాజేష్
పోస్టర్ డిజైనర్: ఎల్లో టూత్స్
PRO: వంశీ శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

- Advertisement -
RELATED ARTICLES

Latest News