రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఈ నెల 21న హైదరాబాద్(Hyderabad)కు రానున్నారు. ఆ రోజు మధ్యాహ్నం ఒకటీ పది నిమిషాలకు బేగంపేట ఎయిర్‌పోర్టు(Begumpet Airport)కు చేరుకుంటారు. ఒకటిన్నరకు రాజ్‌భవన్(RajBhavan)కు వెళ్తారు. అక్కడ మధ్యాహ్న భోజనం చేసి సాయంత్రం 3 గంటల 25 నిమిషాల వరకు విశ్రాంతి తీసుకుంటారు. 3 గంటల 50 నిమిషాలకు బొల్లారం(Bollaram)లోని రాష్ట్రపతి నిలయాని(Rastrapathi Nilayam)కి వెళతారురు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు భారతీయ కళా మహోత్సవం(Bharatiya Kala Mahostavam)లో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు తిరిగి రాజ్‌భవన్‌కి వస్తారు. రాత్రి అక్కడే బస చేసి 22న ఉదయం తొమ్మిదిన్నరకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి పుట్టపర్తి(Puttaparthi)కి బయలుదేరతారు.
President | 21న హైదరాబాద్‌కు రాష్ట్రపతి
- Advertisement -
RELATED ARTICLES

