Monday, January 19, 2026
EPAPER
Homeవరంగల్‌Celebrations | రెడ్ క్రాస్ సొసైటీ లో ముందస్తు సంక్రాంతి సంబరాలు.

Celebrations | రెడ్ క్రాస్ సొసైటీ లో ముందస్తు సంక్రాంతి సంబరాలు.

  • తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందిద్దాం: పాలకవర్గం.

హనుమకొండ జిల్లా కేంద్రంలోని రెడ్ క్రాస్ సొసైటీ ప్రాంగణంలో రెడ్ క్రాస్ సొసైటీ పాలకవర్గ సభ్యులు సంక్రాంతి పండుగ సందర్బంగా తెలంగాణ సంస్కృతిని పరిరక్షించడంలో భాగంగా శనివారం ముగ్గుల పోటీ ఘనంగా నిర్వహించింది. ఈ ముగ్గుల పోటీలలో వివిధ ప్రాంతాలనుంచి మహిళలు ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు వేసినారు. ముగ్గుల పోటీల విజేతలకు మొదటి బహుమతి బి. స్వప్న కు రెండవ బహుమతి కె. శ్రీజిత కి మూడవ బహుమతి సి.హెఛ్. శిరీష లు బహుమతులు రాగ మిగితా ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ బహుమతులు అందచేసినారు.

ఈ సందర్బంగా చైర్మన్ డాక్టర్ పి. విజయచందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను మనం పాటిస్తూ భవిష్యత్తు తరాలకు అందించాలన్నారు. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తూ సంక్రాంతి పండుగకు పతంగులు ఎగురవేస్తూ, ముగ్గులు వేయడం ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు. ముగ్గుల పోటీల కన్వీనర్ గా చెన్నమనేని జయశ్రీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ పి. విజయచందర్ రెడ్డి, కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, జిల్లా పాలకవర్గ సభ్యులు: పుల్లూరి వేణు గోపాల్, డాక్టర్ హెచ్. సంధ్యారాణి, చెన్నమనేని జయశ్రీ, బాశెట్టి హరిప్రసాద్, రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News