ప్రజావాణి దరఖాస్తులను(Prajavani applications) క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్జీలు పరిష్కరించాలని కలెక్టర్ పమేలా సత్పతి(pamela satpathy) అన్నారు.సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే(Ashwini Tanaji Wakade)(స్థానిక సంస్థలు), లక్ష్మి కిరణ్ (రెవిన్యూ )డీఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్ బాబుతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించారు. మొత్తం 339 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా కరీంనగర్ నగరపాలికకు 68, హౌసింగ్ శాఖకు సంబంధించి 43 దరఖాస్తులు వచ్చాయి.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -
