Thursday, March 26, 2026
Homeస్పోర్ట్స్Vaibhav | సూర్యవంశీకి పురస్కారం

Vaibhav | సూర్యవంశీకి పురస్కారం

యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi).. ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్’(Pradhan Mantri Rashtriya Bal Puraskar)ను అందుకున్నాడు. ఈ అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్‌(Rastrapati Bhavan)లో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము(Droupadi Murmu) పాల్గొన్నారు. ఆమె చేతుల మీదుగా సూర్యవంశీ ఈ పురస్కారం స్వీకరించాడు. చిన్న వయసులోనే ఆటల్లో ఉత్తమ ప్రదర్శన ఇచ్చినందుకు ఇతణ్ని ఈ అవార్డుకు సెలెక్ట్ చేశారు.

వైభవ్ సూర్యవంశీ ఘనతలు

  • చిన్న వయసులో (14 ఏళ్ల 23 రోజులకే) ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు.
  • రాజస్థాన్ రాయల్స్ తరఫున ఈ ఏడాదే అడుగుపెట్టిన ఇతను.. మూడో మ్యాచ్‌లోనే 35 బాల్స్‌కే సెంచరీ చేసి ఔరా అనిపించుకున్నాడు.
  • ఆసియా కప్ రైజింగ్ స్టార్స్, అండర్-19 ఆసియా కప్, సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీల్లో శతకాలు బాదాడు.
- Advertisement -
RELATED ARTICLES

Latest News