లైన్స్ వింగ్, సబ్ స్టేషన్ వార్షిక నిర్వహణ పనుల కారణంగా బుధవారం 33 కేవీ బాలాజీ నగర్ సబ్ స్టేషన్ పూర్తిగా షట్ డౌన్ అవుతుందని బాలాజీ నగర్ ఏఈ సాంబ శివరావు తెలిపారు. ఈ నేపథ్యంలో 11 కేవీ లక్ష్మీ నర్సింహ ఫీడర్, ఆనంద్ నగర్ ఫీడర్, సాయిబాబా ఫీడర్, మహంకాళి ఫీడర్, డెంటల్ కాలేజీ ఫీడర్ల పరిధిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 02 గంటల వరకు నాలుగు గంటల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.
ఈ సమయంలో చెన్నాపూర్, లక్ష్మీ నర్సింహ కాలనీ, శివ నగర్, ఆదర్శ్ నగర్, వికలాంగుల కాలనీ, సింగిల్ బెడ్ రూమ్, డబుల్ బెడ్ రూమ్‌లు, రేణుకా నగర్, ముత్తుస్వామి కాలనీ, బీరప్ప గడ్డ, బగత్ సింగ్ కాలనీ, గబ్బిలాలపేట్, శాంతి నగర్, రాజీవ్ నగర్, సిపీఐ కాలనీ, జ్యోతి కాలనీ, లెవిస్ ఎన్‌క్లేవ్, వి కే ఎన్‌క్లేవ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాలనీ, అయ్యప్ప కాలనీ, సిటిజన్ కాలనీ, ఆనంద్ నగర్, సాయిబాబా టెంపుల్ కామన్ రోడ్, వెంకటేశ్వర కాలనీ, బాలాజీ నగర్ ప్రధాన రహదారి తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ఈ షట్ డౌన్ సమయంలో సహకరించాలని ఏఈ సాంబ శివరావు కోరారు.
