బాలాజీ నగర్ పరిధిలో గురువారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు బాలాజీ నగర్ విద్యుత్ ఏఈ సాంబశివరావు తెలిపారు. 11 కెవి బాలాజీ నగర్ సబ్ స్టేషన్ పరిధిలోని ఏడు ఫీడర్లలో చెట్ల కొమ్మలు కత్తిరించడం, విద్యుత్ లైన్ల మెయింటెనెన్స్ పనులు చేపడుతున్న కారణంగా ఈ అంతరాయం ఏర్పడుతున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ పనుల వల్ల చెన్నాపురం, లక్ష్మీనరసింహ కాలనీ, శివనగర్, ఆదర్శనగర్, వికలాంగుల కాలనీ, సింగల్ బెడ్ రూమ్, డబుల్ బెడ్ రూమ్ ప్రాంతాలు, ముత్తుస్వామి కాలనీ, బీరప్ప గడ్డ, భగత్ సింగ్ కాలనీ, గబ్బిలాలపేట, శాంతినగర్, రాజీవ్ నగర్, మోహన్ రావు కాలనీ, వి కే ఎంక్లేవ్, ఎక్స్ సర్వీస్మెన్ కాలనీ, అయ్యప్ప కాలనీ, సిటిజన్ కాలనీ, ఆనంద నగర్, సాయిబాబా టెంపుల్ రోడ్, వెంకటేశ్వర కాలనీ, బాలాజీ నగర్ మెయిన్ రోడ్డు, మార్వాడి గల్లి, మహంకాళి కాలనీ, సుక్కమ కుంట, సుభద్రయ్య కాలనీ తదితర ప్రాంతాలు ప్రభావితమవుతాయని తెలిపారు.
ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని పేర్కొన్న ఆయన, ఈ సమయంలో వినియోగదారులు సహకరించాలని కోరారు.
