Friday, September 12, 2025
ePaper
spot_img
Homeఅంతర్జాతీయంపోప్ ఫ్రాన్సిస్‌ ఆరోగ్య పరిస్థితి విషమం

పోప్ ఫ్రాన్సిస్‌ ఆరోగ్య పరిస్థితి విషమం

పోప్‌ ఫ్రాన్సిస్‌ ఆరోగ్యం విషమంగా ఉంది. 88 ఏళ్ల పోప్‌ ఇటీవల ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో రోమ్‌లోని గెమిల్లీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. పరీక్షల అనంతరం ఎనీమియా సంబంధిత సమస్యను గుర్తించిన వైద్యులు ఆయనకు రక్తాన్ని మార్చారు. అయినా పోప్ పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కాగా, పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యంపై ఇప్పుడేమీ స్పందించలేమని వాటికన్ ఓ ప్రకటన విడుదల చేసింది. శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు, న్యూమోనియాకు వైద్యులు వైద్యం అందిస్తున్నారు.త్వరలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై బులెటన్ విడుదల చేసే అవకాశముంది. పోప్ ఆరోగ్యం విషమంగా ఉందని వాటికన్ ప్రకటించింది. ఆయన ప్రమాదం నుంచి ఇంకా బయటపడలేదని వ్యక్తిగత ఫిజీషియన్ లూగీ కార్బొన్ ప్రకటించారు. ఆయన గత రాత్రి బాగానే నిద్రపోయినట్లు వెల్లడించారు. దక్షిణార్థ గోళం నుంచి పోప్ అయిన మొదటి వ్యక్తి ఫ్రాన్సిస్. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో 1936లో జన్మించిన ఫ్రాన్సిస్ అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. 2013లో నాటి పోప్ బెనెడిక్ట్ 16 రాజీనామాతో ఫ్రాన్సిస్ కేథలిక్ చర్చి అధిపతి అయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News